ఆదివారం సెలూన్ లో కట్టింగ్ చేయిన్చుకున్తుండగా, ఆ సెలూన్ అతను పాత తెలుగు పాటలు పెట్టాడు. అన్ని మహ్మద్ రఫీ తెలుగు లో పాడిన పాటలు వస్తున్నాయి.ఆ షాప్ అతని అభిరుచి ని మనసులోనే మెచ్చుకుంటూ , ఆ పాటలు ఆస్వాదిస్తూ ఉంటె ఎప్పుడు వినని ఒక పాట నన్ను ఆకర్షించింది. రఫీ గారు ఎ పాటయినా ఎల్లన్టిదయినా పాడతారని తెలుసు గాని. ఇంత ఫాస్ట్ బీట్ పాడగా నేను ఎప్పుడు వినలేదు. రఫీ తో ఇలాగ కూడా పాడిన్చారా అని ఆశ్చర్యమేసింది. కొన్ని ఫాస్ట్ గా పాడినవి విన్న గుర్తు ఉంది కాని ఈ పాట నేను ఇంతకుముందు వినలేదు. తెలుగు లో రఫీ గారు పాడితే ఆయన గళం లో ఒక మాధుర్యం వినిపిస్తుంది. ఎన్నో పాటలు విన్నా కాని ఈ పాట రఫీ గొంతులో సరదాగా ,గమ్మత్తుగా విచిత్రంగా సాగింది. రఫీ ఏదయినా పాడగలడు అని ఇప్పుడు మనం కితాబు ఇయ్యల్సిన పని లేదు కాని ఈ పాట వింటే ఏదయినా , ఎలా అయినా పాడగలడు అనిపిస్తుంది. రఫీ గారి మధురమయిన పాటలు ఎన్నో ఉన్నాయి.ఇదీ మంచి పాట అని కాని మధురమయిన పాట అని కాని నేను ఇక్కడ రాయట్లేదు. అదీ రఫీ గొంతులో వినడానికి సరదాగా, విచిత్రంగా ఉంది అన్నది నా ఆలోచన.
అతన్ని ఎందులోది అని అడిగితె చెప్పలేకపోయాడు. ఇంటికి వచ్చాక గూగులమ్మ ను ఆశ్రయిస్తే అది భలే తమ్ముడులోది అని చెప్పింది. మహానటుడు యెన్ .టి.ఆర్. మరియు కే.ఆర్. విజయ నటించిన ఈ చిత్రం బి.ఎ.సుబ్బారావు గారి దర్శకత్వం లో 1969 లో విడుదలయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ టి.వి.రాజు గారు. సుశీల గారితో కలిసి రఫీ పాడిన ఈ పాట ను ఆ అంతర్జాలం నుంచి దిమ్పెసా , అదేనండి "డౌన్లోడ్" చేశా , తెలుక్కి వచ్చిన కష్టాలు లెండి, ఇప్పుడు ఆ లంకె ను మీ ముందుంచా. అదేంటో అక్కడక్కడ ఆగిపోతుంది. ఎందుకో అర్థం కాలేదు. సరదాగా మీరు వినండి.
అతన్ని ఎందులోది అని అడిగితె చెప్పలేకపోయాడు. ఇంటికి వచ్చాక గూగులమ్మ ను ఆశ్రయిస్తే అది భలే తమ్ముడులోది అని చెప్పింది. మహానటుడు యెన్ .టి.ఆర్. మరియు కే.ఆర్. విజయ నటించిన ఈ చిత్రం బి.ఎ.సుబ్బారావు గారి దర్శకత్వం లో 1969 లో విడుదలయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ టి.వి.రాజు గారు. సుశీల గారితో కలిసి రఫీ పాడిన ఈ పాట ను ఆ అంతర్జాలం నుంచి దిమ్పెసా , అదేనండి "డౌన్లోడ్" చేశా , తెలుక్కి వచ్చిన కష్టాలు లెండి, ఇప్పుడు ఆ లంకె ను మీ ముందుంచా. అదేంటో అక్కడక్కడ ఆగిపోతుంది. ఎందుకో అర్థం కాలేదు. సరదాగా మీరు వినండి.
17 comments:
ప్లే అవడంలేదండీ Not found 404 error అని వస్తుంది.
మీరు చెప్పేది "ఎంతవారలైన గాని వేదాంతులైన గానీ" పాట గురించా :) దీని హిందీ వెర్షన్ "బార్ బార్ దేఖో హజార్ బార్ దేఖో" అని ఉంటుంది మరి సినిమా కూడా హిందీ రీమేకో పాట ఒక్కటే తీసుకున్నారో నాకు తెలియదు.
ప్లే అవుతుంది కదా అది గుమ్మ గుమ్మ గుమ్మేత్తించే అన్న పాట . .నేను ఓపెన్ చేస్తే ప్లే అవుతుంది మీరన్న పాట కూడా బాగుంటుంది .
baagundi meeru raasinatlu saradagaa, raffi gontu ela paadina baguntudni
భాను,
రఫీ పేరును అంత ఖూనీ చేసేశారేమిటి సార్! సింపుల్ గా రఫీ అనరాదా! ఆ వత్తు ఫ, మళ్ళీ దానికింద ఇంకో వత్తు అక్కరలేదుగా.
ఇప్పుడు మీరు పెట్టిన పాట లో రఫీ గాత్ర మాధుర్యం ఏ మాత్రం కనిపించలేదు కానీ నాకైతే తెలుగు లో రఫీ బెస్ట్ సాంగ్ " నా మది నిన్ను పిలిచింది గానమై' అనిపిస్తుంది.
రఫీ తెలుగు పాటల్లో ఉత్తమమైనవి 'తానే మేలి ముసుగు తీసి' & 'తారలెంతగా మెరిసేనో' .... అక్బర్-సలీం-అనార్కలి నుండి. 'నా మది నిన్ను ..'లోలా పట్టి పట్టి పాడటం ఉండదు వీటిలో. విని చెప్పండి :-)
@కల్పనా
థాంక్స్. సరి చేఅసాను. నేను మాధుర్యం గురించి చెప్పలేదు. రఫీ గారి గొంతులో ఇలా వినడం సరదాగా గమ్మత్తుగా విచిత్రంగా ఉంది అని రాశానండి
@భాను...థాంక్స్ ఆండీ. మీరు చెప్పారని కాదు. నా అభిప్రాయం చెప్పాను
@అబ్రకదబ్ర ...మీరు చెప్పింది కొంతవరకే నిజమనుకుంటున్నాను. ఎందుకో తెలుసా...తానే మేలి ముసుగు తీసి ...ట్యూన్ ...హై పిచ్ లో పాడక్కరలేదు...నా మది నిన్ను పిలిచింది...ట్యూన్ అలా వుండదు..దానివల్ల కూడా కొంత అలా అనిపిస్తుండవచ్చు.
కావాలంటే మళ్ళీ వినండి..మొదటి చరణం లో...నేనే అనుకొంటినా...కలగంటినా అన్నదాంట్లో అనుకొంటినా ఎంత వొత్తి పలుకుతాడో, అసలు ఆ తానే అన్న పదాన్నే తమాషాగా పలుకుతాడు...అది రఫీ స్టైల్ అనుకోవాలి...లేదా తెలుగు మాతృభాష కాకపోబట్టి అనికూడా అనుకోవచ్చేమో...
ఏమైనా..మళ్ళీ ఇంకో మంచి సాంగ్ గుర్తు చేశారు. ధన్యవాదాలు..
భాను మీ హైర్ కటింగ్ కాదు కానీ మాకు రఫీ పాటలు గుర్తుకు వచ్చ్కాయి.మళ్ళీ ఎప్పుడాండీ మీరు సెలూన్ కి వెళ్ళేది:-)
అయ్యో, సిపాయి సిపాయి...సాంగ్ గుర్తు చేసుకోకుండా వెళ్లాను. ..హసీనా...నీ కోసం ఎంత ఎంత వేచానో...అంటూ రఫీ పాడిన పాట ...ఇప్పుడేమో కానీ ఒకప్పుడు ప్రేమికుల హిట్ పాట కదా...
ఆ పాటలు మీకు బాగా నచ్చాయా! ఆ కాలంలో అవో చెత్త పాటలు. ఓల్డ్ వైన్ లాగా 30 ఏళ్ళకు గొప్ప పాటలైనాయంటే ఆశ్చర్యమే.
త్తార ల్లెన్ త్తగా మెరిషేనో
చ్చన్ దురుని కోసం :))
న్నేనూ ఫిర దోశెనా లేక
ఆనియన్ దోశ నా క్కాని
అన్ ట్టారు నన్ను స్కై లాబని
అన్నచోట చాలా బాగా వుంటుంది. ఆ వత్తుడు లోనే హాస్యరసం పలికించారా మహా గాయకుడు.
@వేణు, అనాన్య్ముస్ లకు ధన్యవాదాలు
@అబ్రకదబ్ర గారు మీతో ఏకిభవిస్తున్నాను.
@కల్పనా గారు ధన్యవాదాలు. రఫీ పాటలు వింటుంటే వినాలనిపిస్తుంది. మీరన్నట్లు అది రఫీ స్టైల్ కావచ్చు లేదా తెలుగు మాతృభాష కాకపోవడం వల్ల కావచ్చు. ఏది ఏమయినప్పటికీ రఫీ తెలుగు పాటలు అందులో కొన్ని పాటలు " నా మది నిను పిలిచింది "లాంటివి ఎన్ని సార్లు అయినా వినవచ్చు. ఇక్కడ గుమ్మ గుమ్మ పాటలో రఫీ గొంతు పాడిన విధానం రఫీ స్టైల్ కి కొద్దిగా బిన్నంగా అనిపించింది. ఈ సారి సలూన్ కి వెళ్ళినప్పుడు మల్లి కొత్త పాటలను మీకు గుర్తు చేస్తా లెండి.
@అనానిమస్ గారు ఎవరి అభిరుచి వారిది/ అవి మీకు నచ్చాలని లేదు మీకు నచ్చినవి మాకు నచ్చాలని లేదు. నిజమే మీరన్నట్లు పాత పాటలు ఓల్డ్ వైన్ లాంటివేమో. ఎంత కాలమయితే అంత రుచి పెరుగుతున్దనుకుంటా . తెలిసిన వాళ్ళను అడగా
ఇవన్ని చదివాక అనిపించింది. రఫీ గారి మంచి పాటలు వాటిలోని మాధుర్యం సొగసులు కలిపి ఓ పోస్ట్ రాస్తే ఎలా ఉంటుందా అని.
కొత్త అనానిమస్ గారు
మీ ఋ చెప్పింది అమోఘం. మీకు ఇంతగా రఫీ పాటలు నచ్చినందుకు థాంక్స్. మనం ఒక్కల్లమో ఇద్దరమో విన్తేని మనం చేబితేని వాళు మహాగాయకులు కాలేదు. ప్రపంచమంతా వింటే, చెబితే అయ్యారు. అయ్యా మనమెంత? భాషా రాని వాళ్ళు తెలుగు లో చదువుతే కొంత అలా ఉంటుందేమో మనం దాన్ని ఎద్దేవా చేసేంత స్థాయి మనకు లేదనుకుంటా.
అబ్బ రఫీ పాటలు గుర్తు తెచ్చారు. తెలుగులో "ఎంతవారుగానీ" పాట, "హసీనా" పాట నాకు చాలా ఇష్టం. ఎంతవారుగానీ లో చిన్నది చేపలాతళుకన్నది చరణంలో హహహహహ అనడం, కైపులో అనడం భలే గమ్మత్తుగా ఉంటుంది.
@సౌమ్య గారు నా బ్లాగ్ లో మీ కామెంట్ ఇదే మొదటిసారి కదా.ధన్యవాదాలు మీరన్నట్లు కొన్ని పదాలు రఫీ గొంతులో మరీ మరీ వినాలనిపిస్తుంది.
Raphi bhai..neevu levu...nee paata
undi maa andari edalotullo
Post a Comment