గోరేటి వెంకన్న గారు రాసి స్వంతంగా పాడిన ఈ "పల్లె కన్నీరు పెడుతుందో" వారి గొంతులోనుండి వచ్చిన పాట నిజంగా ఫీల్ ఇస్తుంది. అందుకే ఆ జానపదం మీరు ఆనందిస్తారని ఇక్కడ.......
భూమాత ఏడ్చింది నా బిడ్డ రైతన్నా....
ఏనాడు స్థిమితంగా తిండి తినదతంచు
చేతి వృత్తులు వారి చేతులిరిగి పాయె
పల్లె కన్నీరోడ్చే పనిపాటల వాండ్ల
ఉనికి కనపడదు నా ఉరిలోనా... ఆ...ఆ..
పల్లె కన్నీరు బెడుతుందో...కనిపించని కుట్రల
నా తల్లీ బంది అయి పోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వాములో తుమ్మలు మొలిచెను
కుమ్మరి కొలిమిలో దుమ్ము లేచెను
సాలెల మగ్గము సడుగులిరిగినవి
పెద్ద బాడిశ మొద్దుబారినది
చేతివృత్తుల చేతులిరిగినాయో....నా పల్లెల్లోన
గ్రామ స్వరాజ్యం గంగలోన మునిగే.....
మడుగులన్ని అడుగంటిపోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎన్దిపోయినవి
సాకలి పొయ్యిలు కులిపోయినాయ్
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో - గా బలిసిన దొరలది
బక్క రైతులా బావులేన్డినాయో నా పల్లెల్లోన
ఎరుక బాపలకు గాలాలేసే - తురకల పోరలు యాడికి బోయిరి
లారిలల్ల క్లీనర్లియ్యిర - పెట్రోల్ మురికిలో మురికైయ్యిన్ద్ర
దుద సేమియాకు దురమైనారా - గాసాఇబు పోరలు
బెకరి కేక్ తో ఆకలి తీరిందో - ఆ పట్టణాలలో
అరకల పనికి ఆకలి తీరక - గడెం నాగలి పని గాసమేల్లక
ఫర్నిచర్ పనులేతుక్కుంటూ - ఆ పట్నం బోయిరి విశ్వకర్మలు
ఆసాములంతా కుసోనున్దేటి - వద్రన్గీ వాకిలి
పొక్కిలి లేసి దుఖిసున్నది - మన పల్లెల్లోన
నరికేమ్పులా తెల్ల జేల్లలు - పరులకు తెలియని మరుగు భాషలో
బెరంజేసే కంసాలి వీధులు - వన్నె తగ్గినవి చిన్న బోయినవి
చెన్నై బొంబాయి కంపెని నగలోచ్చే - నా స్వర్ణకారుల
చన్ద్రకొలలతో తరుముతున్నరన్నో - మన పల్లెల్లోన
మేరోల్ల చేతుల కత్తెర - ములనబడి చిలుమేక్కు పోయినది
కుట్టుడు రెట్టల బానిన్లు పోయినవి - సోదేలాగులు జాడెనే లేవు
రెడీమేడ్ దుస్తుల ఫ్యాశానిచ్చినాడా - మన పల్లెల్లోకి
మన కూలి కంచముల రాళ్ళు గొట్టిరయ్యో - మన పల్లెల్లోన
మాదిగ లొడ్డి నోరు తెరిచినది - తంగేడు చెక్క బెంగ పడినది
తొండము బొక్కెన నిండా మునిగినది - ఆరే రంప
పడునారిపోయినది
పాతరేకులవలె మొగేటి - ఆ ప్లాస్టిక్ డప్పులు
తోలు డప్పులను పాతరేసిరన్న - నా పల్లెల్లోన
ఇల్లు కట్టుకునే ఇటుక రాయికొ సెలక జల్లే ఎరువు కుల్లుకో
ఎద్దుబండి వున్నోడికి చేతుల - ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు తక్కరిచ్చేరన్నో -మన పల్లెల్లోన
ఎడ్లబండి గిల్లిగిరి పడ్డదన్నో - మా పల్లెల్లోన
తొలకరి కురిసితే పులకరించే ఆ నేల పరిమళం ఏడికిబోయే
వానపాములు, నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకుట లేవు
పత్తి మందుల గత్తర వాసన తో - నా పల్లెల్లోన
మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే - నా పల్లెల్లోన
హరిచ్చంద్ర బజన్నతకపంతులు -హర్మోనియుం చెదలు బట్టినది
యక్ష గానము నేర్పే పంతులు -ఉప్పరి పనిలో తట్టబట్టినపుడు
యాచకులు, నా బుడిగా జంగాలు - ఆ పల్లెలు విడిసి
పాతబట్టలు పాళీలు అమ్ముతుండ్రు - ఆ పట్టణాలలో
వందల దత్తెలు కట్టే పీర్లకు - ఒకటి రెండు మూతలు బోయి
అలా నిప్పులు ఆరిపోయినై - పలావు కందులుపాతరబద్దవి
ఇంటికొక్క అయ్యప్ప వెలిసినాడో - నా పల్లెల్లోన
ఇంటి దేవరలు ఇగుల పట్టినయే న పల్లెల్లోన
పిందోలె ఎన్నెల రాలుచుండగా - రచ్చబండపై కూసోని రైతులు
ఏనాకట్ట సుద్దలు ఏటలకతలను - యాది చేసుకొని బాధలు
మరిసేరు చుక్క నోటిలో పడ్డదంటే నేడు- నా పల్లెల్లోన
ఒక్కడు రాతిరి బయటకు రాడయ్యో - మా పల్లెల్లోనా
కోలాటం బతుకమ్మ పాటలు - బజానా కీర్తనలు మద్దెల మోతలు
బైరగుల కిన్నెరా తత్వంములు - కనుమరుగాఎర మన పల్లెల్లోనా
స్టార్ టి వి సకిలిస్తూ వున్నదంమో - మన పల్లెల్లోన
సామ్రాజ్య వాద విశామేక్కుతున్నడంమో - మెల్లంగ పల్లెకు
skip to main |
skip to sidebar
నా గురించి
ఇది కూడా నా బ్లాగేనండి
ఘంటసాల లలిత గీతాలు
నా అతిధులు
Blog Archive
-
▼
2010
(70)
-
▼
August
(16)
- నేనెరిగిన మా నాన్న .. రతీంద్రనాథ్ టాగూర్
- అంధ భిక్షువు
- గోరేటి వెంకన్న..పల్లె కన్నీరు పెడుతుందో
- పల్లె కన్నీరు పెడుతుంది
- ఇదీ మన జీవితం
- తుమ్మేటి గారితో కాసేపు (2)
- ఆర్తితో ......., ఆరాటంతో......
- తుమ్మేటి గారితో కాసేపు (1 )
- మధుశాల
- బాల్యం
- దేఖ ఏక్ క్వాబ్
- కభి కభి మేరె దిల్ మే ఖయాల్ ఆతా హై
- కలలు కల్లలైన వేళ.
- ధ్యానం
- మరిన్ని జ్ఞ్యాపకాలు.............
- జ్ఞ్యాపకాలు
-
▼
August
(16)
2 comments:
Over action
వందేమాతరం గొంతులో ఈ పాట విన్నాను గానీ, స్వయంగా గోరటి వెంకన్న పాడగా ఇదే వినడం. ఇది పాడడం కాదు, ప్రవచనం. ఎంత గొప్ప పాట రాసాడండీ మహానుభావుడు!
వీడియో పెట్టినందుకు నెనరులండీ.
Post a Comment