వానమ్మ, వానమ్మ, ఒక్క సారన్న వచ్చిపోవమ్మ, అంటూ ఎన్నో రోజులుగా రాని ఆ వానకోసం పడే తపన , అప్పడప్పుడు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ బస్సు స్టాండ్ లోనో, లేదా ఏ చౌరస్తా లోనో వినిపించేది. ఆ పాట, ఆ గొంతు మనల్ని కట్టి పదేసేదిగా అనిపించేది. ఒక సారి ఎవరా అని చూస్తే , ఒక అంధుడు, తల్లి సాయం తో చేతిలో కంజర తో " వానమ్మ ..వానమ్మ " అని పాడుతూ కన్పించాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆ బస్సు స్టాండ్ వద్దకు రాగానే నా చూపులు అతని కోసం , నా చెవులు అతని పాట కొరకు వెతికేవి. కొన్ని అలా మన మనసులో ముద్రించుకొని పోయి , మనం ఎక్కడున్నా , మన నాలుకపై ఆడుతూ, అప్రయత్నంగా మనం పాడుకుంటూ ఉంటాం . అలా ఈ పాట నా నోట్లో అప్పుడప్పుడు నానుతుంటుంది. అతను కనపడితే అలాగే ఆ పాట అయిపోయేంతవరకు ఉండి వినే వాణ్ని. అతని గొంతులో నిజంగా రాని వాన కోసం పడే బాధ స్పష్టంగా వినిపించేది. ఆ పాటకు అందం అతను పాడినందు వలననే వచ్చిందా అనిపించేది. ఆ పాట కొరకు కాదు నేను చూసేది . అతని గొంతులో నుండి ఆవేదనతో తో వచ్చే పాట ఎంతొ అద్బుతంగా అనిపించేది . అతను కన్పించక చాల రోజులవుతుంది. అతను గుర్తుకు వస్తే నాకు విశ్వనాథ వారి అంధ భిక్షువు పద్యం గుర్తుకు వస్తుంది.
" అతడు రైలోలో నే బొయినప్పుదేల్ల నెక్కడో ఒక్క చోట దానెక్కు - వాని నతని కూతురు నడిపించు చనుసరించు"
" అతని కన్నులు బొత్తలే - ఆ సమయము నందు తన్ను రక్షింప నేరైనా వత్తురేమోయని చూచి చూచి యట్లె నిలబడి "
"అతని ప్రాణాలు కనుగుళ్ళ యందు నిలిచి......................."
"రైలు ప్రయాణం లో పాటలు పాడుతూ అడుక్కొనే ఒక అంధుడి గురించి కవి హృదయం లో కల్గిన సంచలనం. అతడి పూర్వ జన్మలో నూతిలో తన్ను రక్షించే వాడు లేక మరలా వేదన ననుభవిస్తూ విలపించిన కంట ధ్వని ,సన్నబడి , సన్నబడి ఈ జన్మలో వెతుక్కుంటూ అతన్ని చేరుకున్తుందట . అతని కన్నులు పూర్వజన్మలో నూతిలో పడ్డప్పుడు రక్షించే వారికొరకు ప్రతీక్షించి , పతీక్షించి , కనుగుళ్ళలో నిలుపుకొన్న ప్రాణాలు , మళ్లీ ఈ జన్మలో అతన్ని చేరినాయట .ప్రాణాలు పోయిన తర్వాత మిగిలిన బొత్తలే ఈ జన్మలో చూపు లేని కళ్ళు." అని ఎంత బాగా చెప్పాడు.
నిజంగా ఈ పద్యం చదువుతుంటే నాకు ఆ అంధుడి కళ్ళు , అతని పాట గుర్తుకు వచ్చాయి. ఆ పాట విని చాలా రోజులవుతున్నది , ఆ అంధుడు, ఆ కళ్ళు, ఆ పాట ఇప్పటికి విశ్వనాథుని అంధ భిక్షువై నా కళ్ళ ముందు కనిపిస్తూ , నా హృదయంలో లో విన్పిస్తుంటుంది.
2 comments:
చాలా బాగుందండి.మీరు చదువుతుంటే ఆ పాట విన్న అనుభూతి కలుగుతుంది.
plz send to this song my mail
spydismile@gmail.com
Post a Comment