Monday, August 2, 2010

జ్ఞ్యాపకాలు

జ్ఞ్యాపకం .
మొట్టమొదట శుబ్రం దగ్గర    అ...ఆ...లు నేర్చుకున్న .   జ్ఞ్యాపకం
అయ్యవారి దగ్గర కోదండం చూస్తూ,  అక్షరాలూ చివరి వరకు నేర్చ్కున్న   జ్ఞ్యాపకం
ఇంటి పెరట్లో చింత చెట్టు కింద చింత కాయలు ఏరుకొని తిన్న....  జ్ఞ్యాపకం 

ఎండాకాలం ఆరుబయట  నాయినమ్మ పక్కన పడుకొని చుక్కలు చూస్తూ ఆమె చెప్పిన కథలు వింటూ నిద్రలోకి జారిన....జ్ఞ్యాపకం
 పొద్దున్నే సద్దెన్నం తిని బడికి పోయిన ....జ్ఞ్యాపకం
తాతయ్య తో పొలం గట్ల వెంబడి నడిచిన.....జ్ఞ్యాపకం
ప్రతి శుక్రవారం బియ్యం శర్కర నాయినమ్మ ఇస్తే తీసుకోయి మజీద్ లో ఇచ్చిన... జ్ఞ్యాపకం .
తోటి పిల్లలతో ఉరి బయట పిల్ల కాల్వ లో సరదాగా ఆడిన ....జ్ఞ్యాపకం
ప్రతి ఏడు బతకమ్మలకు మా బతుకమ్మ ఉల్లో పెద్దగుండాలని అమ్మమ్మ పడ్డ కష్టం... జ్ఞ్యాపకం .
సద్దుల రోజు ఆడవాళ్ళూ  "చిన్నీరి మీరు ఏమిట్లు చిన్నరక్క మీరు ఏమిట్లు" అంటూ ఇంటి ముందునుంచి పోయిన. జ్ఞ్యాపకం ....
పొలం దగ్గర రాత్రి ఒక్కడినే కావాలి పన్న ...జ్ఞ్యాపకం
మొదట స్కూల్ లో హెడ్ మాస్టర్ ముందు భయంగా  నిలబడి పేరు చెప్పిన .... జ్ఞ్యాపకం .
సద్దుల రోజు అమ్మతోని చెరువు దగ్గరికి పోయి చెరువుగట్టు మీద ఆడిన ....జ్ఞ్యాపకం
నీళ్ళల్లో దీపాలతో బతుకమ్మ ను వదిలి పెడ్తే కేరింతలు కొడ్తూ ఆనందించిన ....జ్ఞ్యాపకం
ఎడ్లబండ్ల తో ఉల్లో అందరు పోటిగా తిరిగిన .....జ్ఞ్యాపకం
పీరీల పండక్కు దూల దూల అంటూ పీరీల వెంబడి పోయిన....జ్ఞ్యాపకం
సురభి నాటకాల వాళ్ళు వస్తే బాలనాగమ్మ చుసిన ....జ్ఞ్యాపకం
ముత్యాలమ్మ బావి దగ్గర ఆడవాళ్ళూ నీళ్ళు తీసుకెళ్ళే .......జ్ఞ్యాపకం
ఊరిబయట ఏరు పొంగితే బండ్లు కట్టుకొని పోయి చుసిన..... జ్ఞ్యాపకం .
మామిడి  తోటలో దొంగతనంగా మామిడికాయలు కొట్టుకొని తిన్న....జ్ఞ్యాపకం
ఎప్పుడు మొదటి బెంచ్ లోనే కూర్చున్న ....జ్ఞ్యాపకం
చెరువు మత్తడి పోస్తుందంటే పోలో మని వెళ్లి చుసిన ....జ్ఞ్యాపకం
సంక్రాంతి కి కుండల వాయినాలు అమ్మ ఇస్తుంటే  చుసిన.....జ్ఞ్యాపకం
పొద్దున్నే గంగిరెద్దుల వాళ్ళు ఉదుకుంటు ఇంటి ముందరికి వచ్చిన....జ్ఞ్యాపకం
పేపెర్ బాయ్ అంటూ పెద్ద తాతయ్య నోరార పిలిస్తే వార్తలు చదివి విన్పించిన....జ్ఞ్యాపకం
బండ్లు కట్టుకొని పక్క ఉరికి పోయి ఇందిరా గాంది ని చుసిన......జ్ఞ్యాపకం
ఈత నేర్చుకుండామని బావి గట్టున  నిలబడితే బావయ్య నీళ్ళలోకి తోసేసిన ...జ్ఞ్యాపకం .
దీపావళి కి  నాన్న పటాకులు తెస్తే అక్కతో పంచుకొని వాటిని కాల్చిన....జ్ఞ్యాపకం
స్కూల్లో ఎప్పుడు ఫస్టు వచ్చిన......జ్ఞ్యాపకం .
సాయంత్రం చావట్లో బొబ్బడాలు కొనుక్కొని తిన్న ....జ్ఞ్యాపకం .
ఉగాది రోజు ఊరంతా తాతయ్య ఇంటి దగ్గరకి వస్తే  అయ్యగారు పంచాంగం చదివిన ....జ్ఞ్యాపకం
హోలీ రోజు అందరం స్నేహితులం మోదుగ పూల తో రంగులు తయారు చేసుకొని ఉల్లో తిరిగిన ......జ్ఞ్యాపకం
మొదటిసారిగా సైకిల్ కంచి తొక్కినా......జ్ఞ్యాపకం
బాబాయి దగ్గర లెక్కలు నేర్చుకున్న ...జ్ఞ్యాపకం
సెలవుల్లో పనివాళ్ళతో పాటు పావలాకి సోల శేనక్కాయలు కొట్టిన జ్ఞ్యాపకం....

వాన పడుతుంటే చూరు కింద   నీళ్ళ లో తడుస్తూ కాగితపు పడవల తో ఆడిన...జ్ఞ్యాపకం .
రాత్రి  పుట డప్పు సాటిమ్పుతో ఉల్లో వాళ్ళకు విషయాలు చెప్తుంటే విన్న ....జ్ఞ్యాపకం
పొద్దున్నే సరదాగా బర్రేపాలు పితికిన.... జ్ఞ్యాపకం 

  రాత్రి పుట చిడతల రామాయణం , బుర్రకత , హరికత విన్న .......జ్ఞ్యాపకం
స్కైలాబ్ పడుతుందంటే తలుపులు  వేసుకొని కూర్చున్న.....జ్ఞ్యాపకం
ఉల్లోకి తాటకి వేషం వస్తే బయపడి ఇంట్లో అమ్మ చాటు దాక్కున్న ....జ్ఞ్యాపకం

పొలాల వెంబడి, చెట్ల కింద, ఏటిగట్టున, పిల్ల కాల్వల్లో, చెరువుగట్టున, బడిలో ,
మామిడి తోటల్లో, చావట్లో, మజీద్ లో , గుడిలో,    ఇంకా ఇంకా,

తాతయ్య వెంట, అమ్మమ్మ చేత్తో,  అమ్మ చాటున,
నాయనమ్మ ఒడి లో ఎన్నో....ఎన్నెన్నో.....పల్లె .జ్ఞ్యాపకాలు ..

5 comments:

Anonymous said...

chinnanaati gyapakalu baagunnai. okkasari mammalni malli akkadiki teesukellaru

Kalpana Rentala said...

భాను గారు,

మీ జ్నాపకాలు చాలా బాగున్నాయి. కాకపోతే ఒక్కో జ్న్నపకం ఒక్కో పోస్ట్ రాస్తే ఇంకా బాగుంటుంది. ఆ దిస్గా ఆలోచించండి.

vasavi said...

Hey Annaih,
Chala bagundi nee gnapakalu.. nakaithe mana nellikuduru gurthu kochindi... Bathakamma aythe nenu chala miss aythanu....

కొత్త పాళీ said...

భానుగారు, కల్పన గారి మాటని బలపరుస్తున్నాను. ఒక్కో జ్ఞాపకాన్ని గురించీ ఒక్కో టపా రాయండి.

సద్దులు = ??
బొబ్బడాలు = ??

భాను said...

thanks kothapali garu, saddulu ante batukamma la chivari roju tommidavarojunu saddulu antaaru. ika bobbadaalu ante bajjeelu maa chinnappudu ullo atlaane ammevaru